WEST GODAVARI
కువైట్‌లో బాంబుల మోత.. భయంతో ఆగిపోయిన తెలుగోడి గుండె
ఉపాధి కోసం కువైట్ వెళ్లిన రాకేష్ అనే యువకుడిని యుద్ధ వాతావరణం బలితీసుకుంది
పాలకొల్లు మండలం డాంపేట గ్రామానికి చెందిన రాకేష్ కువైట్ లో మృతి
మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలంటున్న రాకేష్ తండ్రి
ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఒక తెలుగింటి యువకుడిని అక్కడి యుద్ధ వాతావరణం బలితీసుకుంది. బాంబుల మోతకు భయపడి.. నాన్న.. నేను ఇంటికి వచ్చేస్తాను అంటూ ఫోన్ చేసిన ఆ కొడుకు.. ఆ తర్వాత విగతజీవిగా మారాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం డాంపేట గ్రామానికి చెందిన రాకేష్ ఉపాధి నిమిత్తం తొమ్మిది నెలల క్రితం కువైట్ వెళ్ళాడు.. రాకేష్ తల్లి రమణ కూడా కువైట్ లోనే ఉంది. యుద్ధం మొదలవగానే ఇంటికి వచ్చేస్తాను అంటూ తండ్రికి ఫోన్ చేసిన రాకేష్ మరుసటి రోజు భయంతో మృతి చెందాడు. విషయం తెలిసి రాకేష్ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.


