ELURU
ఏలూరు జిల్లా
ఆక్వా కల్చర్, వరి సాగు, కొల్లేరు సరస్సు పర్యావరణ ప్రాధాన్యంతో ఏలూరు జిల్లా ప్రత్యేక స్థానం సంపాదించింది. వ్యవసాయం–పర్యావరణ పరిరక్షణ సవాళ్లు ఇక్కడ కీలకం. ఇప్పుడు జిల్లా విశేషం.
ఏలూరు జిల్లాలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంట్రాక్టర్
డంపింగ్ యార్డులో నిబంధనలకు వ్యతిరేకంగా చెత్తకు నిప్పంటిస్తున్న కాంట్రాక్టర్
చెత్తను తగలబెట్టడంతో దట్టంగా పొగ కమ్ముకోవడంతో కాలనీ వాసులు ఉక్కిరి బిక్కిరి
శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నపిల్లలు
కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్
ఏలూరు జిల్లాలోని పోణంగి రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డ్ చుట్టు పక్కల ప్రజలకు నరకం చూపిస్తోంది. ఈ యార్డులోని చెత్తను రీసైక్లింగ్ చేయాల్సిన కాంట్రాక్టర్ అడ్డదారి తొక్కి ఖర్చు తగ్గించుకునేందుకు ఏకంగా చెత్తకు నిప్పు పెడుతున్నారు. డంపింగ్ యార్డ్‌లో గుట్టలు గుట్టలుగా ఉన్న చెత్తను తగలబెడుతుండటంతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంటోంది. ఈ విషవాయువుల వల్ల సమీపంలోని వైఎస్సార్ కాలనీ, పోణంగి, రాజరాజేశ్వరి కాలనీ, విఎన్ఆర్ గ్రాండ్ సిటీ, అలాగే జేపీ కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత రెండు రోజులుగా ఈ పొగ కాలుష్యంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు శ్వాస తీసుకోవడానికి అవస్థలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్న అధికారులు తమను పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కనుసన్నల్లోనే కాంట్రాక్టర్ ఈ దారుణానికి ఒడిగడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చెత్తను తగలబెట్టే ప్రక్రియను నిలిపివేసి తమ ప్రాణాను కాపాడాలని వేడుకుంటున్నారు. నిబంధనలు గాలికి వదిలేసిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీ అందిస్తారు.


