KRISHNA
కృష్ణా జిల్లా
వ్యవసాయం, మత్స్యకార రంగం, మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధితో కృష్ణా జిల్లా ఆర్థికంగా ముందంజలో ఉంది. పర్యాటక అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ జిల్లా విశేషం ఇప్పుడు.
అసెంబ్లీలో అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ వ్యాఖ్యలు
రుషికొండ భవనాలను స్టేట్ మ్యూజియంగా మార్చాలని సూచన
10 ఏళ్లయినా నిధుల కొరతతో మ్యూజియం ఏర్పాటు అవ్వలేదని వెల్లడి
తెలంగాణ నుంచి ఏపీకి సంబంధించిన 50 వేలకు పైగా…
పురాతన వస్తువులు, శాసనాలు మ్యూజియంలో ప్రదర్శించాలని సూచన
విశాఖపట్నం రుషికొండ భవనాలను స్టేట్ మ్యూజియంగా మార్చాలని కృష్ణాజిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఆలోచనను రేకెత్తించాయి. అసెంబ్లీ సమావేశాల్లో సాంస్కృతిక, పర్యాటక శాఖపై చర్చించిన ఆయన రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా నిధుల కొరతతో స్టేట్ మ్యూజియం నిర్మాణం జరగలేదన్నారు. తెలంగాణా నుంచి రాష్ట్రానికి సంబంధించిన 50వేలకు పైగా పురాతన వస్తువులు, శాసనాలు రుషికొండ భవనాల్లో ప్రదర్శనకు ఉంచి భావితరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తెలుసుకునే వేదికలా ఆయా భవనాలను స్టేట్ మ్యూజియంగా మార్చాలని ప్రతిపాదించారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.


