ANAKAPALLI
అనకాపల్లి జిల్లా
బెల్లం మార్కెట్లు, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులతో అనకాపల్లి జిల్లా వాణిజ్యకేంద్రంగా ఎదుగుతోంది. సమీప పోర్ట్ కనెక్టివిటీతో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ జిల్లా ముఖ్యాంశం ఇప్పుడు.
నాతవరం మండలంలో రూ. 48 కోట్లతో అభివృద్ధి పనులు
మూడు దశలుగా నిధులు మంజూరు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
స్వర్ణ్యాంద్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 5 ట్రాక్టర్లు అందజేత
10 పంచాయతీలలో స్మశానాలను కట్టించిన కూటమి నేతలు
అన్ని ప్రాంతాల్లో రోడ్ల ప్యాచ్ వర్క్స్‌ను పూర్తిచేసిన అధికారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో 48 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నాతవరం మండలంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని ప్రాంతాల్లో రోడ్ల ప్యాచ్ వర్క్ లను పూర్తి చేశారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నాయకత్వంలో నాతవరం మండలంలో రోడ్ల నిమిత్తం మూడు విడతలుగా నిధులు మంజూరు చేశారు.
మొదటి విడతగా 14 కోట్లు మంజూరు చేయగా ఇంటర్నల్ రోడ్లు, పూర్తిగా శిథిలమైన రోడ్లను పునర్నిర్మానం చేయడానికి, రెండో విడతగా ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా ఆ నిధులను పూర్తిగా వినియోగించారు. 10 పంచాయతీలలో స్మశానాలను కట్టించారు. మూడో విడతగా 16 కోట్ల నిధులు మంజూరు చేయగా ఇందులో భాగంగా ఆర్ అండ్ బి ప్రాజెక్టులో 8 కోట్లు , సిసి రోడ్లకు 5 కోట్లు , ట్రైబల్ వెల్ఫేర్ గ్రాంట్ కు 3 కోట్ల 20 లక్షలు కేటాయించారు. అభివృద్ధితో పాటు స్వర్ణ్యాంద్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 5 ట్రాక్టర్లను నాతవరం గ్రామానికి అందజేశారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరసండెంట్ ఈశ్వర్ అందిస్తారు.


