KONASEEMA
కోనసీమ జిల్లా
కొబ్బరి, పంటలు, నదీ డెల్టా సాగుతో ప్రసిద్ధి చెందిన కోనసీమ జిల్లా పర్యాటకంగా కూడా ఆకర్షణగా మారుతోంది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోంది. కోనసీమ తాజా అప్డేట్ చూద్దాం.
గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ప్రజల సహాయార్ధం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందిస్తున్న MEA, APNRTS
అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లను వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచన
ప్రజల రక్షణకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మహేష్ కుమర్
ఇరాన్, ఇజ్రాయిల్ మద్య యుద్ద వాతావారణం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత పశ్చిమ ఆషియా, గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రవాసుల రక్షణ కోసం భారత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ప్రభుత్వాల సహాయ కేంద్రాలు, భారత ప్రభుత్వ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాయి. ఈ కేంద్రాలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందిస్తాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న జిల్లా పౌరులు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఇబ్బందులు, అత్యవసరాలు ఎదురైతే MEA, APNRTS కంట్రోల్ రూమ్‌లను వెంటనే సంప్రదించాలని కలెక్టర్ ఆదేశించారు. బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయిల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, పాలస్తీనా, సౌదీ అరేబియా, UAEలోని భారత రాయబార కార్యాలయాలు 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు. అక్కడ పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల రక్షణకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.


