CHITTOOR
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లాలో తెలుగు యాసపై తమిళ భాష ప్రభావం కనిపిస్తుంది.
కొన్ని పదాల ఉచ్చారణలో ప్రత్యేక ధ్వని వినిపిస్తుంది.
సరిహద్దు సంస్కృతి భాషలో వైవిధ్యాన్ని తీసుకొచ్చింది.
మాటల్లో మృదుత్వం, పలకరింపుల్లో ఆప్యాయత కనిపిస్తుంది.
దక్షిణ ఆంధ్ర ప్రాంత ప్రత్యేకతను చూపించే యాసగా ఇది నిలుస్తుంది.
చిత్తూరు జిల్లాలో అద్వానంగా తయారైన ప్రభుత్వ భవనాలు
నిరూపయోగంగా మారిన ప్రభుత్వ లావాదేవీల భవనాలు
అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యలయాలు నిర్వహణ
కోట్ల రూపాయలతో కట్టించి పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వ భవనాలు
చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భవనాల పరిస్థితి అద్వానంగా తయారైంది. అనేకచోట్ల నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. ప్రైవేటు అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తూ అధిక మొత్తాన్ని ప్రైవేటు వాళ్లకు చెల్లిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ భవనాలను మాత్రం నిరూపయోగంగా మార్చి ప్రజాధనాన్ని వృధా పాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
గంగవరం మండలం మామడుగు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కోట్ల రూపాయల ఖర్చుపెట్టి నిర్మించి ఇప్పుడు పిచ్చి మొక్కలు , మందుబాబులకు అడ్డాగా మార్చేశారు. కార్యాలయం మొత్తం అధిక సంఖ్యలో పిచ్చి మొక్కలు, ఎక్కడ చూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి.
ప్రభుత్వ భవనాలుపై ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకనే విధంగా సచివాలయం పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వ ధనంతో నిర్మించిన భవనాలను కాపాడుకొని ప్రజాపాలన చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.

