ANAKAPALLI
అనకాపల్లి జిల్లా
అనకాపల్లి అంటే ముందుగా గుర్తొచ్చేది బెల్లం.
ఇక్కడ తయారయ్యే బెల్లం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి.
బెల్లంతో చేసే మిఠాయిలు, స్వీట్లు ఎక్కువగా ఉంటాయి.
చేపల వంటలు కూడా ఇక్కడ విస్తృతంగా కనిపిస్తాయి.
సాంప్రదాయ రుచులతో అనకాపల్లి ఆహారం ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఆందోళనలో మామిడి తోటల రైతులు
గతేడాది మామిడి రైతులను ముంచిన పురుగులు
పెట్టుబడి రాక నష్టాలు చవిచూశామని రైతుల ఆవేదన
ఈ ఏడాదైనా లాభాలు వస్తే అప్పులు తీరిపోతాయని ఆశాభావం వ్యక్తం
ఈ ఏడాది అయినా తమ బ్రతుకులు బాగుంటాయా అని అనకాపల్లి జిల్లా మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మామిడి పళ్లలో పురుగులు రావడంతో ధరలు పడిపోయి భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలు చవిచూస్తున్నామని వాపోతున్నారు. ఈ సంవత్సరమైనా దిగుబడి బాగా వచ్చి లాభాలు వస్తే అప్పులు తీరిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


