KAKINADA
కాకినాడ జిల్లా
కాకినాడ అంటే ముందుగా గుర్తొచ్చేది కాకినాడ కాజా.
ఈ స్వీట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
చేపల వంటలు కూడా విస్తృతంగా వాడుతారు.
తీరప్రాంతం కావడంతో సముద్ర ఆహారం ఎక్కువగా ఉంటుంది.
తీపి, కార రుచులతో కాకినాడ ఆహారం ప్రత్యేకంగా నిలుస్తుంది.
ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
APNGGO జిల్లా కోశాధికారి పద్మ మీనాక్షి ఆధ్వర్యంలో నిర్వహణ
దాదాపు 350 మంది పాల్గొని ఉత్సాహంగా గడిపిన మహిళలు
ప్రతిరోజూ ఉద్యోగంలో ఎంతో ఒత్తిడిని అనుభవించే మహిళలకు కాస్త ఉపశమనం దొరికింది. కాకినాడలో మహిళా ప్రభుత్వ ఉద్యోగులు డాన్సులతో రచ్చ రచ్చ చేశారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా APNGGO జిల్లా కోశాధికారి పద్మ మీనాక్షి ఆధ్వర్యంలో “మహిళా ఉద్యోగుల క్రీడల పోటీలు” ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళలకు ఒకరోజు సెలవు ప్రకటించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 350 మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు.


