PRAKASAM
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా విస్తారమైన పల్లెలు, ప్రకృతి సోయగాలతో ప్రసిద్ధి.
నల్లమల అడవులు ఈ జిల్లాకు ప్రకృతి అందాలను అందిస్తాయి.
గుండ్లకమ్మ నది ఈ ప్రాంతానికి జీవనాధారం.
వెలిగొండ కొండలు, ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
అడవులు, కొండలు, పల్లె సౌందర్యం కలిసిన ప్రకాశం జిల్లా ప్రత్యేకత.
• నల్లమల అడవుల్లో అరుదైన హనీ బ్యాడ్జర్
• తెలుగులో రైలు ఎలుగు… ధైర్యానికి మరో పేరు
• చిన్నదైనా తెగువలో పులికి సవాల్
• తేనె తుట్టెల లార్వా ఇష్టమైన ఆహారం
• ఎత్తు 12 అంగుళాలు… గోళ్లు 3 అంగుళాలు
• పులి ఎదురొచ్చినా వెనక్కి తగ్గని వన్యప్రాణి
• నల్లమల అడవుల్లో కనిపించే అరుదైన జీవి
చూసేందుకు చిన్నగా కనిపించినా… ధైర్యం మాత్రం పులిని సైతం ఎదిరించేంతటి శక్తి. ఇదే హనీ బ్యాడ్జర్… తెలుగులో రైలు ఎలుగు అని పిలిచే అరుదైన వన్యప్రాణి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నల్లమల అభయారణ్యంలో కనిపించే ఈ జంతువు దేహం చిన్నదైనా తెగువ మాత్రం అమోఘం. పెద్దపులులు, చిరుతలను కూడా ఎదుర్కొనే ధైర్యం దీనికి ఉంది.
ఎత్తు కేవలం 12 అంగుళాలు మాత్రమే. పంజాలో మూడు అంగుళాల పొడవైన గోళ్లు ఉంటాయి. బరువు సుమారు 10 కిలోలే అయినప్పటికీ పౌరుషంలో దీనికి సాటి వన్యప్రాణి చాలా అరుదు. తేనె తుట్టెల్లోని లార్వా దీనికి అత్యంత ఇష్టమైన ఆహారం. అందుకే దీనిని హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు.
చూసేందుకు చిన్న ఎలుగుబంటి లాగా కనిపించే ఈ జంతువు జీవితకాలం సుమారు ఏడేళ్లు మాత్రమే. ధైర్యం, దూకుడుతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ అరుదైన వన్యప్రాణిపై మరిన్ని విశేషాలు తెలుసుకుందాం… మా ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో వివరిస్తారు.
