ANANTAPUR
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా విస్తారమైన మైదానాలతో ప్రసిద్ధి.
ఎండప్రాంతం అయినప్పటికీ ప్రత్యేకమైన ప్రకృతి అందాలు ఉన్నాయి.
చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు వ్యవసాయానికి ఆధారం.
పొడి భూముల్లో పెరిగే వృక్షాలు ప్రత్యేకత.
రాయలసీమ భౌగోళిక స్వభావాన్ని ప్రతిబింబించే జిల్లా అనంతపురం.
• ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం రైతులపై
• గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు నిలిపివేత
• ముంబై పోర్టులో చిక్కుకున్న వందల కంటైనర్లు
• ధరలు పడిపోవడంతో రైతుల ఆందోళన
• అనంతపురం, కర్నూలు రైతులకు భారీ నష్టం
• డిమాండ్ తగ్గడంతో మార్కెట్ దెబ్బ
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రభావం రైతులపై పడుతోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన అరటి, ద్రాక్ష ఎగుమతులు నిలిచిపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు.
ముంబై పోర్టులో వందలాది కంటైనర్లు నిలిచిపోవడంతో స్థానిక మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సుమారు 500 నుంచి 600 కంటైనర్ల పండ్ల ఎగుమతులు ఆగిపోవడంతో వేల టన్నుల పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధానంగా అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని రైతులు కూడా ఈ ప్రభావానికి గురయ్యారు. రంజాన్ సమయంలో గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉండే డిమాండ్ ఈసారి యుద్ధం కారణంగా పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
