KURNOOL
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా నల్లమల అడవులు, కొండలతో ప్రసిద్ధి.
తుంగభద్ర, హంద్రీ వంటి నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి.
గుహలు, పర్వత ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
అడవి సంపద ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు.
ప్రకృతి వైవిధ్యంతో కూడిన జిల్లా కర్నూలు.
• హంద్రీనీవా ప్రాజెక్టులో చారిత్రాత్మక రికార్డు
• ఒకే సీజన్‌లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు
• 2012 తర్వాత ఇదే తొలి భారీ సరఫరా
• కర్నూలు–అనంతపురం–కడప మీదుగా కుప్పం వరకు నీరు
• రాయలసీమ రైతులకు ఊరట
• గత రికార్డు 40 టీఎంసీలు మాత్రమే
రాయలసీమకు ప్రాణాధారంగా భావించే హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. శ్రీశైలం నుంచి ఈ ప్రాజెక్టు కాలువకు ఒకే సీజన్‌లో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి అధికారులు చరిత్ర సృష్టించారు. 2012లో ట్రయల్ రన్ ప్రారంభమైనప్పటి నుంచి ఒకే సీజన్‌లో ఇంత భారీగా నీటిని ఎత్తిపోవడం ఇదే తొలిసారి.
ఇక గతంలో 2019–20 సంవత్సరంలో సుమారు 250 రోజుల్లో 40 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు. కానీ ఈసారి ఇప్పటికే 50 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల మీదుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వరకు నీటిని తీసుకువెళ్లారు. రాయలసీమ రైతులకు ఇది పెద్ద ఊరటగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ బి.శ్రీనివాస్ అందిస్తారు.
