KADAPA
కడప జిల్లా
కడప జిల్లా రాయలసీమ ప్రాంతంలో కొండలు, అడవులతో ప్రసిద్ధి.
పెన్నా నది ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది.
నల్లమల కొండలు ప్రకృతి అందాలకు ప్రతీక.
అడవులు, గుట్టలు ఈ ప్రాంత భౌగోళిక స్వభావం.
ప్రకృతి వైవిధ్యాన్ని చూపించే జిల్లా కడప.
కడపలో కొత్త ఎకో పార్క్‌కు శంకుస్థాపన
• ద్వారకా నగర్‌లో రూ.45 లక్షలతో పార్క్ నిర్మాణం
• ఎన్-క్యాప్ నిధులతో ఆధునిక వసతులు
• పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశాలు
కడప నగరంలో పర్యావరణాన్ని మెరుగుపరచే దిశగా మరో అడుగు పడింది. నగరంలోని ద్వారకా నగర్‌లో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఆధునిక ఎకో పార్క్‌కు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ నిర్వహించారు.
ఎన్-క్యాప్ నిధులతో నిర్మించనున్న ఈ ఎకో పార్క్‌ను అత్యాధునిక వసతులతో, ప్రజలకు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అలాగే పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ పార్క్ ఏర్పాటుతో ద్వారకా నగర్ ప్రాంత ప్రజలకు మంచి వినోదం, విశ్రాంతి ప్రదేశం లభించనుంది.
