PALNADU
పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా విస్తారమైన పల్లెలు, కొండలతో ప్రసిద్ధి.
నాగార్జున సాగర్ జలాశయం ఈ ప్రాంతానికి ప్రధాన నీటి వనరు.
చిన్న గుట్టలు, మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక స్వభావం.
వ్యవసాయం, పశుపోషణ ఈ ప్రాంత ప్రజల జీవనాధారం.
పల్లె సంస్కృతి, ప్రకృతి కలిసిన ప్రాంతం పల్నాడు.
నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై దాడులు
• విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
• గోదాముల్లో నూనె నమూనాల సేకరణ
• తనిఖీలు వస్తే మిల్లులకు తాళాలు వేసే యజమానులు
• సాంపిల్స్ ల్యాబ్‌కు పంపనున్న అధికారులు
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు ఆయిల్ మిల్లులు, గోదాముల్లో అధికారులు తనిఖీలు చేపట్టి నూనె నమూనాలను సేకరించారు.
అధికారుల దాడుల సమాచారం తెలిసిన వెంటనే కొంతమంది మిల్ యజమానులు తమ మిల్లులకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. అధికారుల తనిఖీలు వచ్చిన ప్రతిసారి ఇలా తాళాలు వేసి వెళ్లడం గమనార్హంగా మారింది.
సేకరించిన నూనె నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులపై మరిన్ని వివరాలను మా పల్నాడు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కొత్తపల్లి శ్రీను అందిస్తారు.
