ANAKAPALLI
అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం సముద్రతీరం ఉంది.
పశ్చిమాన తూర్పు ఘాట్ కొండలు విస్తరించాయి.
చిన్న నదులు, వాగులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి.
తీర ప్రాంతం–కొండలు కలిసిన భౌగోళిక స్వరూపం అనకాపల్లి ప్రత్యేకత.
ఏపీ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం
ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ కంపెనీల ఏర్పాటుకు రంగం సిద్ధం
ఈ నెల 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ఉత్తరాంధ్రలో పారిశ్రామిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ కంపెనీల ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీలకు సంబంధించి కొన్ని భవనాల కట్టడాలను కూడా ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు.
