RAYALASEEMA
రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ దక్షిణ–పశ్చిమ భాగంలో విస్తరించి ఉంది. విస్తారమైన మైదానాలు, కొండలు, పీఠభూములు ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం. పెన్నా, తుంగభద్ర వంటి నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. నల్లమల పర్వత శ్రేణులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు. రాయలసీమ సంస్కృతి, చారిత్రక ప్రాధాన్యం ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన ఏర్పాటు
చైన్నై- హైదరాబాద్ తగ్గనున్న ప్రయాణ భారం
సోమేశ్వరం నుంచి సంగమేశ్వరం వరకు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం
త్వరలోనే ప్రారంభం కానున్న బ్రిడ్జ్ పనులు
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లోని కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ సస్పెన్షనబుల్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కీలకమైన అడుగు పడింది. NH-167కే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తెలంగాణలోని సోమేశ్వరం నుంచి ఆంధ్రాలోని సంగమేశ్వరం వరకు కృష్ణా నదిపై 800 కోట్ల రూపాయలతో ఒక కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో 80 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది, తద్వారా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. దీనిపై మా రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ బి.శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు.
