NELLORE
నెల్లూరు జిల్లా
నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం తీర ప్రాంతం విస్తరించింది.
పెన్నా నది ఈ జిల్లాలో ప్రధానంగా ప్రవహిస్తుంది.
తీర మైదానాలు, సరస్సులు ఈ ప్రాంత భౌగోళిక లక్షణాలు.
తీరప్రాంత మైదాన భూభాగం నెల్లూరు జిల్లాకు ప్రత్యేకత.
నేటి నుంచి ముత్యాలమ్మ జాతర ప్రారంభం
వరాల తల్లి జాతరకు భారీగా ఏర్పాట్లు
జాతరకు ఆర్టీసీ 120 ప్రత్యేక బస్సులు
ముత్యాలమ్మ జాతరకు 5 లక్షలకుపైగా భక్తులు వచ్చే అవకాశం
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పుకనుపూరులో భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లిగా ముత్యాలమ్మ తల్లి విరాజిల్లుతుంది. ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం నేటి నుంచి 13 వరకు ఘనంగా జరగనుంది. బుధవారం పోలేరమ్మ నిలుపు, గురునాథస్వామి గ్రామోత్సవం.. గురువారం యార, గురునాథస్వామి ఉత్సవం, గొల్లల వేడుకలు నిర్వహిస్తారు. ముత్యాలమ్మకు బంగారుచీర అలంకారం చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
ఎక్కడా భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రసిద్ధ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుండి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. జాతరకు దాదాపు 5 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు.
