PRAKASAM GOOD MORNING AP
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన నల్లమల కొండలు ఉన్నాయి.
గుండ్లకమ్మ నది ఈ జిల్లాలో ప్రధాన జలవనరు.
వెలిగొండ కొండలు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
తీర మైదానాలు, కొండ ప్రాంతాలు ఉన్నాయి.
తీర ప్రాంతం–కొండల కలయిక ప్రకాశం ప్రత్యేకత.
ఏపీలో ముగియనున్న స్థానిక సంస్థల పదవీకాలం
స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ రాజాబాబు
స్పెషల్ ఆఫీసర్లు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వం జీవో జారీ
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఉన్న మేయర్లు, కార్పొరేటర్ల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. అలాగే గ్రామ పంచాయతీల సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. స్థానిక సంస్థల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టే వరకు స్థానిక సంస్థల పరిపాలనను స్పెషల్ ఆఫీసర్ల ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే స్పెషల్ ఆఫీసర్లు విధుల్లో చేరాలని సూచిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఇందులో భాగంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు.
