RAYALASEEMA GOOD MORNING AP
కర్నూలు జిల్లా
కర్నూలు జిల్లా రాయలసీమ ఉత్తర ప్రాంతంలో ఉంది.
నల్లమల పర్వత శ్రేణులు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
తుంగభద్ర, హంద్రీ నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తాయి.
పీఠభూమి మరియు కొండ ప్రాంతాలు ఉన్నాయి.
లోయలు, గుట్టలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
పర్వత–పీఠభూమి ప్రాంతం కర్నూలు ప్రత్యేకత.
రాయలసీమ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత
కొంతకాలంగా ఆలస్యమవుతున్న ప్రొఫెసర్ల నియామకాలు
గెస్ట్ లెక్టర్లు, కాంట్రాక్ట్ బోధన పద్ధతుల వల్ల ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
రాయలసీమ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత సమస్య విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. యూనివర్సిటీలో యుజిసి నిబంధనల ప్రకారం కొంతకాలంగా ప్రొఫెసర్ల, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలు ఆలస్యమవుతున్నాయి. ఫలితంగా, పీజీ మరియు యుజి కోర్సుల బోధనలో అత్యధిక శాతం కాంట్రాక్ట్ పద్ధతి మరియు గెస్ట్ లెక్టర్ల ద్వారా సాగుతోంది. కోర్సుల సంఖ్యకు సరిపడే రెగ్యులర్ ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులకు పీహెచ్.డి. వంటి కోర్సులను చేయడానికి అవకాశాలు లేకుండా పోయాయి.పైగా యూనివర్సిటీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్‌కి 75 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినా నీటి కొరతను తీర్చలేకపోయారు. యూనివర్సిటీలో తాజా పరిస్థితులపై మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు.
