GUNTUR GOOD MORNING AP
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది.
తూర్పు భాగంలో డెల్టా మైదానాలు ఉన్నాయి.
పశ్చిమ భాగంలో చిన్న కొండలు కనిపిస్తాయి.
నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతం కొంత భాగంలో ఉంది.
చిన్న వాగులు, చెరువులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
మైదాన–కొండ ప్రాంతాల కలయిక గుంటూరు ప్రత్యేకత.
గుంటూరు నగరపాలక సంస్థలో ఏసీబీ దాడులు
రెండురోజుల పాటు తనిఖీలు చేపట్టనున్న అధికారులు
టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలపై ప్రత్యేక సోదాలు
గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రెండు రోజుల పాటు తనిఖీలు జరుగుతాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవకతవకలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలు, రికార్డులను పరిశీలించారు. గత కొంతకాలంగా నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.
