KAKINADA
కాకినాడ జిల్లా – వింతలు, విశేషాలు
కాకినాడ పోర్ట్ ముఖ్య సముద్ర వాణిజ్య కేంద్రం.
కాకినాడ కాజా అనే స్వీట్ ప్రసిద్ధి.
హోప్ ఐలాండ్ ఈ జిల్లాలో ప్రత్యేక భౌగోళిక నిర్మాణం.
చమురు మరియు గ్యాస్ పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
తీర ప్రాంత మత్స్యకార కేంద్రంగా కూడా ప్రసిద్ధి.
కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు కట్టుబడి పనిచేస్తోంది: యనమల దివ్య
రైతులకు డిజిటలైజ్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రతో రైతులకు అందిస్తున్నాం
కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని టీడీపీ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులకు డిజిటలైజ్ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. రైతు శ్రేయస్సుకు పాస్ పుస్తకాలు పూర్తి రక్షణ కల్పిస్తాయని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం పకడ్బందీగా రైతు పక్షాన నిలిచిందన్నారు.
రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేందుకు పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రతో అందిస్తున్నామని చెప్పారు. ఈ పాస్ పుస్తకాల ద్వారా రైతుల ఆస్తులపై పూర్తి రక్షణ కల్పించడంతో పాటు భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
