KAKINADA GOOD MORNING AP
కాకినాడ జిల్లా – ఇంట్రో
సముద్రపు గాలి తాకే కాకినాడ జిల్లాకి స్వాగతం!
కాకినాడ కాజా అంటే ‘చాలా టేస్టీ’ రా బాబు.
ఇక్కడి పోర్ట్ సముద్ర వాణిజ్యంలో ముఖ్య కేంద్రం.
హోప్ ఐలాండ్ ప్రత్యేక భౌగోళిక నిర్మాణం.
చమురు, గ్యాస్ పరిశ్రమలు కూడా ఇక్కడ ఉన్నాయి.
TOPS:
కాకినాడలో పెరిగిపోతున్న పిచ్చికుక్కల బెడద
నాలుగేళ్ల చిన్నారిపై నాలుగు పిచ్చికుక్కలు దాడి
బాలుడి శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు
తాటిపర్తి గ్రామంలో సుమారు 15 మందిపై పిచ్చికుక్కలు దాడి
పిచ్చికుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్
KAKINADA GOOD MORNING AP
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పిచ్చికుక్కల బెడద పెరిగిపోతోంది. నాలుగేళ్ల చిన్నారి దాసం యశ్వంత్ పై ఒకేసారి నాలుగు పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది. బాలుడికి శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత నాలుగు రోజుల్లోనే తాటిపర్తి గ్రామంలో సుమారు 15 మందిపై పిచ్చికుక్కలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రామంలో తిరుగుతున్న పిచ్చికుక్కలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఎందుకు పంపలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో పిచ్చికుక్కల నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
