VIZAYANAGARAM GOOD MORNING AP
విజయనగరం జిల్లా
ఈ జిల్లాలో వరి పంట ప్రధానంగా పండుతుంది.
అదనంగా జొన్న, పప్పుధాన్యాలు కూడా సాగుతాయి.
కొన్ని ప్రాంతాల్లో జీడిపప్పు తోటలు ఉన్నాయి.
వ్యవసాయం ఈ జిల్లాలో ముఖ్య జీవనాధారం.
సారవంతమైన భూములు పంటలకు అనుకూలంగా ఉంటాయి
విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు
జిల్లావ్యాప్తంగా 22,926 మంది రెగ్యులర్ విద్యార్థులు…
526 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు: కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం: రామ్ సుందర్ రెడ్డి
విజయనగరం జిల్లా వ్యాప్తంగా 22,926 మంది రెగ్యులర్ విద్యార్థులు, 526 మంది ప్రైవేట్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థులకు ప్రయాణ సమయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే పరీక్ష రాసేందుకు 30 నిమిషాలు వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. హాల్ టికెట్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పరీక్షా కేంద్రాలను గుర్తించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు.
