KURNOOL GOOD MONRNING AP
కర్నూలు జిల్లా
ఈ జిల్లాలో పత్తి, వేరుశెనగ ప్రధాన పంటలు.
అదనంగా వరి, పప్పుధాన్యాలు కూడా సాగుతాయి.
తుంగభద్ర మరియు ఇతర జలవనరులు వ్యవసాయానికి సహాయపడుతున్నాయి.
వర్షాధార వ్యవసాయం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.
వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో ముఖ్య భాగం.
శ్రీశైలంలో నేటి నుంచి 20వ తేదీ వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు
ప్రతి మార్గంలో డోర్ ఫ్రమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచన
సామాన్యలు నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా…
పరిశీలించి లోపలికి అనుమతించాలని ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశం
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది బ్రహ్మోత్సవాలు భక్తుల కన్నుల పండువగా కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎస్పీ సునీల్ షొరాణ్ దిశానిర్దేశం చేశారు. బందోబస్తు కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 300 మంది పోలీసు సిబ్బంది, స్పెషల్ బలగాలతో ఎస్పీ సమావేశామయ్యారు. దేవాలయంలో ప్రవేశించే ప్రతి మార్గంలో డోర్ ఫ్రమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్యలు నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించాలని ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండంట్ మురళీకృష్ణ అందిస్తారు.
