Markapur
మార్కాపురం జిల్లా
ఈ జిల్లాలో పొగాకు, పత్తి పంటలు ప్రధానంగా సాగుతాయి.
అదనంగా వరి మరియు పప్పుధాన్యాలు కూడా పండిస్తారు.
వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక రంగం అభివృద్ధి చెందింది.
సారవంతమైన నేల పంటలకు అనుకూలంగా ఉంటుంది.
రైతులు వివిధ పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు.
మార్కాపురం జిల్లాలో చారిత్రక కంభం చెరువు
ఆసియాలో రెండవ అతిపెద్ద మానవ నిర్మిత చెరువు
విజయనగర కాలంలో నిర్మితమైన జలవనరు
శతాబ్దాలుగా రైతులకు సాగునీటి ఆధారం
పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో చారిత్రక ప్రాధాన్యం కలిగిన జలవనరులలో మార్కాపురం జిల్లాలోని కంభం చెరువు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద మానవ నిర్మిత చెరువుగా గుర్తింపు పొందిన ఈ జలాశయం శతాబ్దాలుగా రైతులకు సాగునీటి ఆధారంగా నిలుస్తోంది. విజయనగర కాలం నుంచి కొనసాగుతున్న ఈ చారిత్రక చెరువు ఇటీవల మళ్లీ చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ల సమావేశంలో దీనిని ఆధునికీకరించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన రావడంతో కంభం చెరువు ప్రాధాన్యం మరోసారి ముందుకు వచ్చింది. ఈ చారిత్రక జలవనరుపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ కుమార్ అందిస్తారు.
