NELLORE GOOD MORNING AP
నెల్లూరు జిల్లా
ఇది నెల్లూరు జిల్లా!
వెలిగొండ పర్వతాలు ఈ జిల్లాకు సహజ రక్షణ గోడలలా ఉంటాయి.
పులికాట్ సరస్సు ప్రకృతి అద్భుతంగా నిలిచింది.
వలస పక్షులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తాయి.
కృష్ణపట్నం పోర్ట్ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం.
ప్రకృతి, వాణిజ్యం కలిసిన జిల్లా ఇదే.
నేర నియంత్రణే లక్ష్యం అంటున్న నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల
జిల్లాలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్స్
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక చర్యలు
సెర్చ్ ఆపరేషన్స్‌లలో రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లు తనిఖీ
నెల్లూరు జిల్లాలో నేర నియంత్రణే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసులు సమస్యత్మక ప్రాంతాలను చుట్టూముడుతున్నారు.
ప్రతి ఇంటిని తనిఖి చేస్తూ ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికలు, అనుమానిత వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లాలో నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం కార్డెన్ సెర్చ్‌లు తరచూ కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం నెల్లూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నాగతేజ అందిస్తారు.
