KAKINADA GOOD MORNING AP
కాకినాడ జిల్లా
ఇది కాకినాడ జిల్లా!
పాపికొండల సమీప ప్రాంతాలు ఈ జిల్లాకు సహజ అందాన్ని ఇస్తాయి.
తీర ప్రాంతం, నదీ ప్రాంతం కలిసి ప్రత్యేక భౌగోళిక నిర్మాణం.
హోప్ ఐలాండ్ ప్రకృతి అద్భుతం.
పోర్ట్ కార్యకలాపాలు ఇక్కడ ప్రధానమైనవి.
సముద్రం, ప్రకృతి కలిసిన ప్రాంతం ఇదే.
అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం ఏర్పాటు
కాకినాడలో విగ్రహావిష్కరణను వర్చువల్‌గా వీక్షించిన కలెక్టర్ షణ్మోహన్
పొట్టిశ్రీరాములు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన అధికారులు
అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం “స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్” పేరుతో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అధికారులు, ప్రతినిధులు వర్చువల్ గా వీక్షించారు.
కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, వైశ్య ప్రతినిధులు, అధికారులు కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీలు, ప్రతినిధులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 6.80 ఎకరాల విస్తీర్ణంలో స్మృతి వననాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పొట్టి శ్రీరాముల త్యాగాన్ని స్మరించేందుకు ఏర్పాటు చేసిన విగ్రహం రాష్ట్ర ప్రతిష్టను సూచిస్తూ, ప్రజలకు ఆరాధన స్థలంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
