KRISHNA GOOD MORNING AP
కృష్ణా జిల్లా
ఇది కృష్ణా జిల్లా!
ఇంద్రకీలాద్రి కొండపై కనకదుర్గమ్మ ఆలయం భక్తులకు ప్రధాన ఆకర్షణ.
ఈ కొండ నుంచి కృష్ణా నది అందాలు అద్భుతంగా కనిపిస్తాయి.
ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు.
కుచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం అయిన నేల ఇదే.
భక్తి, సంస్కృతి కలిసిన జిల్లా.
వేసవి తీవ్రతపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం
అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ డీకే బాలాజీ
ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని సూచనలు
చిన్నపిల్లలు, వయోవృద్ధులు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశం
కృష్ణా జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వడగాలుల దృష్ట్యా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర చోట్ల మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఆ నీటిని పరీక్షించడంతో పాటు ప్రతిరోజు ఆ నీటిని మార్చాలన్నారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత, వడగాలుల కారణంగా వడదెబ్బ, డిహైడ్రేషన్ కి గురైవుతారని తెలిపారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమే అవుతుందన్నారు. ముఖ్యంగా శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయో వృద్ధులు వడదెబ్బకు తొందరగా ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉండటంతో వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు.
