ELURU GOOD MORNING AP
ఏలూరు జిల్లా
కొల్లేరు సరస్సు ఆసియాలో పెద్ద తీయని నీటి సరస్సుల్లో ఒకటి.
వలస పక్షులు వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి.
ఆక్వా కల్చర్‌లో ముందంజలో ఉంది.
పర్యావరణ పరిరక్షణకు కీలకం.
చేపల పెంపకం విస్తృతంగా జరుగుతుంది.
సరస్సు జీవ వైవిధ్యానికి నిలయం.
ప్రకృతి సంపదకు కేంద్రం.
రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజలు గ్యాస్ కొరతపై ఆందోళన చెందవద్దని సూచన
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 3 లక్షల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
ప్రజలు అనవసరంగా అదనపు బుకింగ్స్ చేయవద్దని మంత్రి సూచనలు
రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. ఏలూరు జిల్లాలో పర్యటించిన ఆయన, గ్యాస్ సరఫరాపై ఉన్న అపోహలను కొట్టిపారేశారు. రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌కు అనుగుణంగా సిలిండర్లను సరఫరా చేస్తున్నామని, ఎక్కడా కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కేవలం ఏలూరు జిల్లాలోనే బుకింగ్స్ భారీగా పెరగడం పట్ల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉందనేది కేవలం పుకారు మాత్రమేనని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఏలూరు జిల్లాలో సాధారణంగా రోజుకు 12 వేల బుకింగ్స్ జరగాల్సి ఉండగా, ప్రస్తుతం అది 50 వేలకు చేరిందని.. దీనివల్ల కొంత ఒత్తిడి పెరిగిందని వివరించారు. గత ఆరు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 3 లక్షల సిలిండర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంకు భారీ షిప్ ద్వారా అదనపు గ్యాస్ నిల్వలు దిగుమతి కానున్నాయని, దీనితో సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. గ్యాస్ అంశంతో పాటు జిల్లాలోని పలు అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లా సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వంద శాతం డొమెస్టిక్ గ్యాస్ సరఫరా అయ్యేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు అనవసరంగా కంగారు పడి అదనపు బుకింగ్స్ చేయవద్దని మంత్రి కోరారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.
