రంజాన్ కానుకగా ఇమామ్, మౌజన్లకు గుడ్ న్యూస్
రూ.45 కోట్ల వేతన బకాయిల విడుదల.. సీఎం చంద్రబాబు నిర్ణయం
ఇఫ్తార్ విందులో హామీ.. గంటల్లోనే నిధుల విడుదల
10 వేల మందికి డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్
ఇమామ్, మౌజన్లకు ఆరు నెలల బకాయిల క్లియర్
రంజాన్ సందర్భంగా కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం
ముస్లిం మత గురువులకు భారీ ఉపశమనం
మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
ఒక శుభవార్త…
రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రూ.45 కోట్ల గౌరవ వేతన బకాయిలను ఒకేసారి విడుదల చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని కొన్ని గంటల్లోనే అమలు చేయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది ఖాతాల్లోకి నేరుగా నగదు జమైంది.ఈ అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ లైన్‌లో ఉన్నారు.
రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గౌరవ వేతన బకాయిల కోసం రూ.45 కోట్లను విడుదల చేసింది.
గత ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఒకేసారి క్లియర్ చేయడంతో ముస్లిం మత గురువులకు ఉపశమనం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేశారు. అందులో 5,000 మంది ఇమామ్‌లకు రూ.30 కోట్లు, 5,000 మంది మౌజన్లకు రూ.15 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం ఇచ్చిన హామీని కొన్ని గంటల్లోనే అమలు చేయడం విశేషంగా మారింది. గౌరవ వేతనాల చెల్లింపులో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మత గురువులకు ఆర్థిక భరోసాను కల్పించనుంది. ఇకపై వేతనాలు ఆలస్యం కాకుండా క్రమబద్ధంగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.
