అమరావతి: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కెమెరా చేతబట్టి ఫొటోగ్రాఫర్లను ఉత్సాహపరిచారు. అసెంబ్లీ వద్ద ఫొటోగ్రాఫర్లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కెమెరాతో వివిధ కోణాల్లో ఫొటోగ్రాఫర్ల చిత్రాలను తీశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. చరిత్రను రికార్డు చేస్తూ, జ్ఞాపకాలను భద్రపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, కళాత్మక ప్రతిభ, నిరంతర శ్రమను కొనియాడారు.


