నిజామాబాద్లో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో TRS పార్టీ అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుటుంబమే తనను పార్టీ నుంచి బయటకు నెట్టేసిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఆమె ఆరోపించారు. అయితే తాను పిరికిదానిని కాదని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా నిలబడతానని పేర్కొన్నారు. “పుట్టినిల్లు నన్ను నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపితే.. మెట్టినిల్లు నన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంది” అంటూ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సభలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న పరిణామాలను గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానులు స్పందించారు.

