ANAKAPALLI GOOD MORNING AP
అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం సముద్రతీరం విస్తరించింది.
పశ్చిమాన తూర్పు ఘాట్ కొండలు కనిపిస్తాయి.
చిన్న నదులు, వాగులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి.
తీర మైదానాలు మరియు కొండ ప్రాంతాలు ఉన్నాయి.
తీర ప్రాంతం–కొండల కలయిక అనకాపల్లి జిల్లాకు ప్రత్యేకత.
అనకాపల్లి జిల్లాలో అందమైన బీచ్ రేవు పోలవరం
పర్యాటకులు అత్యధికంగా వచ్చే సాగరతీరం
రేవు పోలవరం అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపణ
పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుతున్న పర్యాటకులు
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో ఉన్న ఒక అందమైన బీచ్,.. రేవు పోలవరం…. ఇక్కడ బీచ్ అందాలు చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేంత అందంగా ఉంటుంది. ప్రధానంగా సాగరతీరం అంటే మనకు గుర్తుకు వచ్చేది విశాఖ. సువిశాలమైన సముద్ర తీరం.. పచ్చని కొబ్బరి తోటలు.. ఉత్తరాంధ్ర సాగరతీరం అంటే ప్రజలకు ఎంతో ఇష్టం.
అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో రేవు పోలవరం ప్రకృతి అందాలు మాట్లలో చెప్పలేనివి. రెండు కొండల మధ్య ఎంతో అందంగా ఉంటుంది. సాగర తీరప్రాంతాల్లో అత్యంత అందమైనదిగా ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం గుర్తింపు పొందింది. కార్తీకమాసంలోనే కాకుండా, ఏడాది పొడవునా ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం గాలికొదిలేసిందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రదేశానికి మంచి గుర్తింపు లభిస్తోందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు.
