ANANTAPURAM
అనంతపురం జిల్లా
రాయలసీమ ప్రాంతంలో కారంగా ఉండే వంటలు ఎక్కువగా ఉంటాయి.
రాగి సంకటి, నాటుకోడి పులుసు ప్రధాన ఆహారం.
కారంగా ఉండే మటన్ కూరలు కూడా ప్రసిద్ధి.
ఎండ ప్రాంతం కావడంతో పొడి కూరలు ఎక్కువగా చేస్తారు.
రాయలసీమ రుచిని ప్రతిబింబించే వంటలు అనంతపురం ప్రత్యేకత.
కోడిగుడ్డు ధరలు పతనం… సంక్షోభంలో పౌల్ట్రీ పరిశ్రమ
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం… గల్ఫ్‌కు గుడ్ల ఎగుమతులు నిలిచివేత
హాఫ్ రేటుకు పడిపోయిన కోడిగుడ్లు… ఆందోళనలో ఫామ్ యజమానులు
దేశవ్యాప్తంగా సరఫరా అధికం… క్షీణించిన గుడ్ల ధరలు
రోజుకు రూ.5 కోట్ల నష్టం… తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం
కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మొన్నటిదాకా పెరిగిన ధరలు ఇప్పుడు హాఫ్ రేటుకు పడిపోవడంతో ఫామ్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు, పోర్టులు ప్రభావితమై గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా సరఫరా అధికమై ధరలు క్షీణించాయి. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ ధర రూ.4.50గా ఉండగా, స్థానిక మార్కెట్లలో రూ.3.30కు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ రంగానికి రోజుకు సుమారు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది.
భారతదేశం నుంచి ఒమన్, యుఎఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలకు ప్రతిరోజూ సుమారు 10 మిలియన్ గుడ్లు ఎగుమతి అవుతాయి. అయితే యుద్ధ ప్రభావం, అలాగే సౌదీ అరేబియా విధించిన దిగుమతి నిషేధం కూడా ధరలు పడిపోవడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులోని నమక్కల్ ఎగ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడగా, తెలుగు రాష్ట్రాల మార్కెట్‌పైనా ప్రభావం కనిపిస్తోంది.
ఇక కోడిగుడ్ల ధరలు అమాంతం పడిపోవడంతో అనంతపురం జిల్లాలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. రంజాన్ మాసంలో ధరలు పెరుగుతాయని భావించినా… ఇప్పుడు యుద్ధ ప్రభావంతో సగానికి పైగా పడిపోవడం ఊహించలేదంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
