ANANTHAPURAM
అనంతపురం జిల్లా
ఎండలను జయిస్తూ సౌరశక్తి ఉత్పత్తిలో ముందంజలో నిలుస్తున్న అనంతపురం జిల్లా రాయలసీమ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పంటల వైవిధ్యం, పరిశ్రమల పెట్టుబడులు అభివృద్ధికి దారితీస్తున్నాయి. ఇప్పుడు అనంతపురం వార్తలు.
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడిగాలులు
అనతంపురంలో 37.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
రాబోయే రోజుల్లో పలు ప్రాంతాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
వడగాల్పులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచనలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెల మొదటి రోజు నుండే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏకంగా 37.3 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, అమరావతి, నెల్లూరు జిల్లా కావలి, తిరుపతి, కడప, నంద్యాల, కర్నూలలో ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలు దాటాయి.
రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉందంటే.. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని అందరూ భయపడుతున్నారు. 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


