ELURU
ఏలూరు జిల్లా
ఏలూరు జిల్లా కృష్ణా–గోదావరి డెల్టా మైదాన ప్రాంతంలో ఉంది.
సారవంతమైన మైదాన భూములు ఎక్కువగా కనిపిస్తాయి.
చిన్న కాలువలు, చెరువులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
తక్కువ ఎత్తులో ఉన్న భూములు ఎక్కువగా ఉంటాయి.
డెల్టా మైదాన భూభాగం ఏలూరు జిల్లాకు ప్రత్యేకత.
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ రంగం
ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు
ఎగుమతులు ఆగిపోవడమే కారణం
ఆందోళన చెందుతున్న పౌల్ట్రీ రైతులు
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా కోడి గుడ్ల ఎగుమతికి బ్రేక్
రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోవడం, మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు రైతులకు పెద్ద దెబ్బగా మారాయి. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు సగానికి పైగా తగ్గిపోయాయి. ముఖ్యంగా చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దీనికి కారణమయ్యాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై పడుతోంది.
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే కోడిగుడ్ల ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్‌లో గుడ్ల నిల్వలు పెరిగిపోయాయి. దీంతో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అక్కడ జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశంలో కూడా అనేక రంగాలపై కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, కోడిగుడ్లు సహా పలు వస్తువుల ఎగుమతులు కూడా మందగిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు ఇంకా కొనసాగితే రైతులు, వ్యాపారులు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీ అందిస్తారు.
