GUNTUR
గుంటూరు జిల్లా
గుంటూరు జిల్లా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది.
తూర్పు భాగంలో డెల్టా మైదానాలు ఉన్నాయి.
పశ్చిమ భాగంలో చిన్న కొండలు కనిపిస్తాయి.
నాగార్జున సాగర్ ప్రాంతం ఈ జిల్లాలో ఉంది.
మైదాన–కొండ ప్రాంతాల కలయిక గుంటూరు ప్రత్యేకత.
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల వేగవంతం
ఏప్రిల్లో ముగియనున్న పంచాయతీ సర్పంచుల పదవీకాలం
మార్చి నెలలో ముగియనున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలోని పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం ముగియనుండగా, మార్చి నెలలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది.
దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెలలో పదో తరగతి పరీక్షలు పూర్తైన తర్వాత ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, అనంతరం కొంత వ్యవధి ఇచ్చి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశముంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.
