KRISHNA
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లాలో సాంప్రదాయ కోస్తా వంటలు ఎక్కువగా ఉంటాయి.
పప్పు, పులుసు, చేపల కూరలు సాధారణంగా కనిపిస్తాయి.
బందరు లడ్డు ఈ ప్రాంత ప్రత్యేక స్వీట్.
సాంప్రదాయ వంటకాలతో కృష్ణా జిల్లా ఆహారం ప్రసిద్ధి.
తీయని, మృదువైన రుచులు ఈ ప్రాంత ప్రత్యేకత.
మచిలీపట్నంలో బాలబాలికలు, యువత భద్రతపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
బాల్య దశలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచన
చెడు మార్గంలో పయనిస్తూ యువత దారితప్పుతున్నారని ఆవేదన
అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు తప్పుదారి పట్టకుండా మంచి, చెడులపై వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి బాలబాలికలు, యువత భద్రతపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువత చెడు మార్గంలో పయనిస్తూ దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య దశలోనే మంచి, చెడులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ బాలాజీ సూచించారు.
