CHITTOOR
చిత్తూరు జిల్లా
చిత్తూరు ప్రాంతంలో తమిళ ప్రభావం ఉన్న వంటలు కనిపిస్తాయి.
ఇడ్లీ, దోసె వంటి వంటలు విస్తృతంగా వాడుతారు.
పాల ఉత్పత్తులతో చేసే స్వీట్లు కూడా ప్రసిద్ధి.
మామిడి పండ్లతో చేసే వంటలు ప్రత్యేకంగా ఉంటాయి.
సరిహద్దు సంస్కృతి ప్రతిబింబించే రుచులు చిత్తూరు ప్రత్యేకత.
అధ్వాన్నంగా మారిన గంగవరం మండలం దండపల్లి రహదారి
ఏదైనా ప్రమాదం జరిగితే కానీ పట్టించుకోరా అంటూ వాహనదారుల ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని వినతి
చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి రహదారి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. దాదాపు 25 గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో పూర్తిగా గుంతలమయంగా తయారైంది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్, కాలేజీ బస్సులు కూడా ఇదే దారిలో వెళ్తుండటంతో ఏదైనా ప్రమాదం జరిగితే కానీ అధికారులు పట్టించుకోరా అంటూ వాహనదారులు మండిపడుతున్నారు. గుంతల వల్ల తమ వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వేడుకున్నారు.


