GUNTUR GOOD MORNING AP
గుంటూరు జిల్లా
ఇది గుంటూరు జిల్లా!
కొండవీడు కొండపై ఉన్న కోట చారిత్రక గుర్తింపు.
ఈ పర్వత ప్రాంతం గుంటూరు చరిత్రలో ముఖ్య స్థానం.
అమరావతి ప్రాంతం కూడా చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది.
మిర్చి మార్కెట్ ఆసియాలోనే ప్రసిద్ధి.
చరిత్ర, వ్యవసాయం కలిసిన జిల్లా ఇదే.
బాపట్లలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం
డివైడర్‌పై మొక్కలకు నీరు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు
డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు
ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పోస్తున్న మున్సిపల్ సిబ్బంది
బాపట్ల పురపాలక సంఘం నిర్వాహకం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టించుకునే అధికారులు ఎవరూ లేరనే ధీమాతో మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక జీబీసీ రోడ్డులో డివైడర్ మధ్య నాటిన మొక్కలకు నీరు అందించేందుకు లక్షల రూపాయలు వెచ్చించి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వ్యవస్థ ప్రస్తుతం పనిచేయని పరిస్థితి నెలకొంది.
మండుతున్న ఎండల కారణంగా డివైడర్‌లో నాటిన మొక్కలు వాడిపోతుండటంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పోస్తున్నారు. దీంతో లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఉపయోగం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను మరమ్మతులు చేసి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.
