CHITTOR GOOD MORNING AP
చిత్తూరు జిల్లా – ఇంట్రో
ఇది చిత్తూరు జిల్లా!
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు.
హార్స్లీ హిల్స్ చల్లని వాతావరణంతో ‘బాగా కూల్’ అనిపిస్తుంది.
మామిడి పండ్లకు ఈ జిల్లా ప్రసిద్ధి.
చరిత్ర, భక్తి, ప్రకృతి అన్నీ కలిసిన ప్రాంతం ఇదే.”
TOPS:
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత
యూరియా దొరకకపోవడంతో రైతులు ఇబ్బందులు
ఎకరానికి ఒక మూట యూరియా సరిపోవడం లేదంటున్న రైతులు
సకాలంలో ఆర్బీకేలకు యూరియా రావడం లేదంటున్న అగ్రికల్చర్ అధికారి
CHITTOR GOOD MORNING AP
చిత్తూరు జిల్లాలో యూరియా కష్టాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో యూరియా దొరకకపోవడం ఒకటైతే, మరోవైపు యూరియా సరిపోవడం లేదని వాపోతున్నారు. తాము సచివాలయం దగ్గరకు ఏడు గంటలకు వస్తే అధికారులు 11 గంటలకు వచ్చి తమకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ యూరియా కోసం ఎండలో నిలబడాల్సి వస్తుందంటున్నారు. సకాలంలో తమకు యూరియా ఇవ్వకుంటే ఏ విధంగా పంటలు పండించుకోవాలని మండిపడుతున్నారు. ఎకరానికి ఒక మూట యూరియా ఇస్తే ఎక్కడ సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో ఆర్బీకేలకు యూరియా రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అగ్రికల్చర్ అధికారి లహరి తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.
