CHITTOR GOOD MORNING AP
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా మామిడి పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి.
ఇక్కడ రైతులు టమోటా, వరి, చెరకు పంటలు కూడా పండిస్తారు.
పండ్ల తోటలు ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపిస్తాయి.
వ్యవసాయంతో పాటు పాలు ఉత్పత్తి కూడా అభివృద్ధి చెందింది.
రైతుల ఆర్థిక వ్యవస్థలో తోటల సాగు కీలక పాత్ర పోషిస్తుంది.
చిత్తూరు జిల్లాలో HP గ్యాస్ ఏజెన్సీపై మండిపడుతున్న వినియోగదారులు
స్టాక్ ఉన్నప్పటికీ సిలిండర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది
వారం రోజుల క్రితమే గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులు
ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవరగం గంగవరం మండల పరిధిలోని HP గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారులు మండిపడుతున్నారు. వారం క్రితమే గ్యాస్ బుక్ చేసుకుని ఓటీపీలు చెప్పినా కూడా ఇంతవరకు తమకు గ్యాస్ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 400 సిలిండర్లు స్టాక్ ఉన్నా కూడా వినియోగదారులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. గ్యాస్ అందుబాటులో ఉన్నా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసరాల కోసం వాడుతున్న గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో గత వారం రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. HP గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు ఉన్న ఎందుకు ఇవ్వడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. గ్యాస్ ఇవ్వకపోగా, వినియోగదారులు ఏజెన్సీ దగ్గరకు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆఫీస్ కు తాళాలు వేసి వెళ్లిపోవడంతో ఈ సంఘటన గంగవరం మండలంలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.
