CHITTOOR
ఇబ్బందుల్లో చిత్తూరు జిల్లా మోనో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ
సరైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ.. సరైన రేట్లు లేక ఇబ్బందులు పడుతున్న యాజమాన్యం
ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటున్న మోనో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రంతో ఆధ్యాత్మిక మహిమను చాటే చిత్తూరు జిల్లా సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా వెలుగొందుతోంది. పాలు, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక బలానికి ఆధారంగా నిలిచిన ఈ జిల్లా ప్రత్యేక ఖ్యాతి సంపాదించింది.
చిత్తూరు జిల్లాలో మోనో ఫ్యాబ్రిక్ తయారు చేసేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అగ్రికల్చర్ పర్పస్, హోమ్ నీడ్ కోసం ఏర్పాటు చేసిన పలమనేరు ఇండస్ట్రియల్ పార్క్ లో 2001 లో 150 కుటుంబాలకు ప్రభుత్వం స్థలాలు ఇచ్చింది. ప్రభుత్వం ఇండస్ట్రియల్ నిర్మాణం చేసింది కానీ.. ఇప్పుడు సరైన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ లేక.. సరైన రేట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలో మోనో ఫ్యాబ్రిక్ ను నమ్ముకుని జీవనం సాగిస్తున్న 150 కుటుంబాలు ఇప్పుడు ఎటువంటి దిక్కు లేక ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కొంతమంది అయితే పూర్తిస్థాయిలో ఫ్యాక్టరీస్ ని అమ్ముకొని వెళ్లిపోగా మరికొందరు పూర్తిగా ఎటువంటి సహకారం లేక దిక్కు తోచని పరిస్థితిలో ఉండిపోయారు. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోలేక, అప్పుల వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయని ప్రభుత్వం నుంచి ఇటువంటి సహకారం లేదని ఇలాగే ఉంటే తమ కుటుంబాలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మరింత సమాచారాన్ని మా చిత్తూరు జిల్లా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.


