CHITTOOR
చిత్తూరు జిల్లా
పాలు, డెయిరీ పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులతో చిత్తూరు జిల్లా ఆర్థిక బలంగా నిలుస్తోంది. తిరుమల సమీపం పర్యాటకానికి ఊతమివ్వగా, పరిశ్రమలు ఉపాధి అవకాశాలు పెంచుతున్నాయి. చిత్తూరు జిల్లా సమాచారం ఇప్పుడు.
చిత్తూరు జిల్లాలో సమస్యల వలయంలో జగనన్న కాలనీ
కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన అధికారులు
కౌండిన్య నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్న కాలనీవాసులు
అధికారులు నిర్లక్ష్యం వీడి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జగనన్న కాలనీలో 2021 సంవత్సరంలో 4 వేల ఇళ్లు మంజూరు చేశారు. కానీ కనీస సౌకర్యాలు ఇవ్వడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ కాలనీకి వెళ్లడానికి రోడ్డు, డ్రైనేజీ, విద్యుత్, త్రాగునీరు, మౌలిక సదుపాయలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సమస్యల వలయంలో జగనన్న కాలనీ కొట్టుమిట్టాడుతోంది. కౌండిన్య నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేస్తే తమకు అన్ని విధాల సౌకర్యం ఉంటుందని, అదేవిధంగా కాలనీలో అనునిత్యం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న పోలీస్ శాఖ రోజు పెట్రోలింగ్ ద్వారా తమ కాలనీకి వస్తే అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవచ్చంటున్నారు. తమను ఓట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప కనీస అవసరాలు తీర్చడంలో అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. తమను మనుష్యులుగా గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.


