CHITTOR GOOD MORNING AP
చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా రాయలసీమ దక్షిణ ప్రాంతంలో ఉంది.
తూర్పు ఘాట్ పర్వత శ్రేణులు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
స్వర్ణముఖి నది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది.
కొండలు, లోయలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం.
అడవి ప్రాంతాలు కొంత భాగంలో కనిపిస్తాయి.
పర్వత–మైదాన ప్రాంతాల కలయిక చిత్తూరు ప్రత్యేకత.
చిత్తూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులు
రోజంతా కూరగాయలు, పూలు అమ్మినా రూ.200,రూ.300 వస్తున్నాయని ఆవేదన
ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి
చిత్తూరు జిల్లాలో చిరు వ్యాపారుల పరిస్థితి రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. సరైన వ్యాపారం లేక కుటుంబాలను పోషించుకోవడంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా కూరగాయలు, పూలు అమ్మినా చేతికి వచ్చే ఆదాయం కేవలం 200 నుంచి 300 రూపాయలే అవుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని నడిపించడం, పిల్లలను చదివించాలంటే చాలా కష్టంగా మారుతుందంటున్నారు. కూరగాయలు, పూల ధరలు పడిపోవడంతో రైతులు కూడా పంటలు పండించడం తగ్గించారని, దాంతో తమ వ్యాపారం మరింత దెబ్బతిందని వాపోతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించి తమను ఆదుకోవాలని చిరు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం చిత్తూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు.
