EAST GODAVARI
తూర్పు గోదావరి జిల్లా
తూర్పు గోదావరి యాస కోస్తా తెలుగు మాధుర్యానికి ప్రతీకగా ఉంటుంది.
స్పష్టమైన ఉచ్చారణ, తీయని మాటలు ఈ ప్రాంత ప్రత్యేకత.
పల్లె సంస్కృతి, వ్యవసాయ జీవితం భాషలో ప్రతిబింబిస్తాయి.
సాహిత్యానికి దగ్గరగా ఉన్న యాసగా కూడా గుర్తింపు పొందింది.
పదాల ప్రాస, మాటల అందంతో గోదావరి భాష ప్రత్యేకంగా నిలుస్తుంది.
కల్తీపాల ఘటన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
మానవహారంగా ఏర్పడిన నిరసన తెలిపిన మాజీ ఎంపీ మార్గాని భరత్
కల్తీపాల ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి
ప్రభుత్వ వైఫల్యమే కల్తీ పాల ఘటన కారణమని ఆరోపణలు
ప్రభుత్వం వైఫల్యం వల్లే ‘కల్తీ పాలు’ సంఘటన చోటుచేసుకుందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. పార్టీ శ్రేణులతో కలిసి మానవహారంగా ఏర్పడి పాల కల్తీ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ పాలు తాగి 9 మంది మృతి చెందారని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. పుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం చీకటి వ్యవహారం నడుపుతోందని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. వేట్లపాలెంలో మృతిచెందిన బాధితులకు 20 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి మృతిచెందిన బాధితులకు 10 లక్షల ప్రకటించడమేమిటని ప్రశ్నించారు. కల్తీపాల ఘటన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ KVV సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు.


