ELURU
ఏలూరు జిల్లా
ఏలూరు జిల్లాలో సరళమైన కోస్తా తెలుగు యాస వినిపిస్తుంది.
వ్యవసాయ జీవితం ప్రతిబింబించే పదాలు ఎక్కువగా ఉంటాయి.
మాటల్లో సహజత్వం, ఉచ్చారణలో స్పష్టత కనిపిస్తుంది.
గ్రామీణ సంస్కృతి భాషలో ప్రధానంగా కనిపిస్తుంది.
సాధారణంగా అందరికీ అర్థమయ్యే సరళమైన యాసగా ఇది నిలుస్తుంది.
2017-18 సెకండ్ ఫేజ్‌లో ప్రారంభించిన నిర్మాణాలు అసంపూర్ణం
జూన్ నెలాఖరుకి అన్నీ సిద్ధం చేస్తామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
బ్యాంకర్లు ఇబ్బంది పెడితే మెప్మా నుండి సిఫార్సు లేఖ తీసుకెళ్లాలని ఎమ్మెల్యే హితవు
ఇళ్ల పట్టాలు కూడా త్వరలో ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 44 వేల ఇళ్లకు 12 వేల ఇళ్లు మాత్రమే పూర్తి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లలో గృహప్రవేశం చేస్తామంటూ సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ ఫేజ్-1లో ఉగాది పండుగకి, జూలై నెలలో ఫేజ్-2 లో నిర్మాణం పూర్తి చేసి ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ అడుగులు వేస్తోంది. ఏడేళ్ల క్రితమే 75 శాతం పూర్తైన ఏలూరు జిల్లాలోని టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వంలో పాడైపోయిన భవనాలుగా మారాయి2017-18 . సెకండ్ ఫేజ్ లో ప్రారంభించిన నిర్మాణాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. ఏలూరు కార్పొరేషన్ లో 2,208, జంగారెడ్డిగూడెంలో 864, నూజివీడులో 2,640 ఇళ్లలో ఒక్కటి కూడా ఇంకా పూర్తి కాలేదు.
కొవ్వూరులో 480, నిడదవోలులో 1,152, తణుకులో 912 ఇళ్లపై కూడా అదే నిర్లక్ష్యం వహించారు. ఏలూరులో టిడ్కో ఇళ్లతో పాటు వేలాది మందికి ఇళ్ల పట్టాలు కూడా త్వరలో ఇస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 44 వేల ఇళ్లు మంజూరు చేస్తే 12 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే 9 వేల ఇళ్లలో లబ్ధిదారులు మకాం వేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు కూడా ఈ ఏడాది పూర్తి చేసేలా మరమ్మత్తులు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.


