PRAKASAM
ప్రకాశం జిల్లా
రాయలసీమ–కోస్తా ప్రభావం కలిసిన ప్రత్యేక యాస ప్రకాశం జిల్లాలో వినిపిస్తుంది.
గ్రామీణ జీవితం ప్రతిబింబించే పదాలు ఇక్కడి భాషలో ఎక్కువగా ఉంటాయి.
మాటల్లో సూటితనం, ఉచ్చారణలో కొద్దిగా కఠినత్వం కనిపిస్తుంది.
వ్యవసాయం, మార్కెట్ సంస్కృతి భాషలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.
స్థానిక పలుకుబడి, ప్రాసతో ప్రకాశం యాసకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గండి చెరువు
టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు చొరవతో మరమ్మత్తు పనులు
పనులు పూర్తి దశకు చేరుకోవడంతో గ్రామంలో ఆనంద వాతావరణం
శాశ్వత పరిష్కారం లభిస్తోందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామానికి సాగు నీరు, త్రాగునీటి అవసరాలను తీర్చే చారిత్రక గండి చెరువు ఇటీవల భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. దీంతో చెరువులో నిల్వ ఉండాల్సిన నీరు వృథాగా పోతుండడంతో రైతులు ఆందోళన చెందారు.
ఈ నేపథ్యంలో గ్రామస్థుల విజ్ఞప్తికి స్పందించిన యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు దాదాపు 16 లక్షల రూపాయల వ్యయంతో గండిచెరువు మరమ్మతు పనులు చేపట్టించారు. ప్రస్తుతం పనులు పూర్తి దశకు చేరుకోవడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చేయలేని ఈ పనిని స్థానిక టీడీపీ ఇంచార్జ్ చేయడంతో వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తోందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు.


