GUNTUR
గుంటూరు జిల్లా
మిర్చి, పత్తి మార్కెట్లకు కేంద్రంగా గుంటూరు జిల్లా జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. విద్యా సంస్థలు, వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందుతోంది. గుంటూరు తాజా వార్త ఇప్పుడు.
గుంటూరులో నగర వాసులకు చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్
ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ కరువు
ఫ్లైఓవర్ల నిర్మాణంలో ఉండటంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతుందన్న డీఎస్పీ
గుంటూరు నగరవాసులకు ట్రాఫిక్ తిప్పలు తలనొప్పిగా మారింది. ప్రధాన రహదారులు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్తపేట హాస్పిటల్, డొంక రోడ్డు, అరండల్ పేట, రైల్వేస్టేషన్ , ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్ సెంటర్, కొల్లి శారదా మార్కెట్, చౌత్రా సెంటర్, పట్నం బజార్, లాలాపేట ఏరియా, నాజ్ సెంటర్ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణ సరిగ్గా లేదని వాహన దారులు ఆరోపిస్తున్నారు. గుంటూరులో పలు ఫ్లైఓవర్లు నిర్మాణంలో ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య పెరుగుతుందని ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.


