GUNTUR
గుంటూరు జిల్లా
గుంటూరు యాసలో వేగం, స్పష్టత ప్రత్యేకతగా కనిపిస్తాయి.
వ్యాపార సంస్కృతి ప్రభావంతో పదాల వినియోగం కొంచెం భిన్నంగా ఉంటుంది.
మాటల్లో ఉత్సాహం, భావ వ్యక్తీకరణలో స్పష్టత కనిపిస్తుంది.
విద్యా కేంద్రాల ప్రభావం భాషలో కనిపిస్తుంది.
కోస్తా ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందిన యాసగా గుంటూరు నిలుస్తుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో మార్పులు
గుంటూరు మిర్చి యార్డ్‌లో రైతులకు మెరుగైన భోజనం సదుపాయం
90 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించేలా ఏర్పాటు
నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సరైన ప్రమాణాలతో భోజనం ఏర్పాట్లు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగంలో బలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గం 18 నెలల తర్వాత ఏర్పాటు చేయడంతో రైతుల్లో కొత్త అసలు చిగురించాయి. తాజాగా భోజన ఏర్పాటు విషయంలో తీసుకున్న నిర్ణయంతో కొత్త పాలకవర్గం ప్రశంసలు అందుకుంటుంది.
గతంలో టెండర్ విలువ 130 రూపాయలకు అందించిన భోజనాన్ని పాలకవర్గం, అధికారులు గుత్తేదారుతో చర్చలు జరిపి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి 90 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించేలా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సరైన ప్రమాణాలతో భోజనం ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు జిల్లా మా స్పెషల్ కరస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు.


