ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లా రాయలసీమ మైదాన ప్రాంతంలో ఉంది.
డెక్కన్ పీఠభూమిలో ఈ జిల్లా భాగంగా ఉంది.
చిన్న కొండలు, గుట్టలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
పొడి వాతావరణం ఈ ప్రాంత భౌగోళిక లక్షణం.
పెన్నా నది పరివాహక ప్రాంతం కొంత భాగంలో విస్తరించింది.
పీఠభూమి–మైదాన భూభాగం అనంతపురం ప్రత్యేకత.
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన ఎగుమతులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నష్టాలను ఎదుర్కొంటున్న రైతులు
ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం
పుచ్చకాయ, కర్బుజా పండ్లకు కేజీకి 10 రూపాయలకు పడిపోయిన ధరలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండ్ల తోటల రైతులు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. డిమాండ్ లేక, స్థానిక మార్కెట్లో ధరలు పడిపోయి, పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ దేశాలకు రవాణా మార్గాలు మూసుకుపోవడంతో, ముఖ్యంగా ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ గా పేరున్న అనంతపురం, రాయలసీమ ప్రాంతం నుండి పండ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో సరఫరా పెరగడం వల్ల పుచ్చకాయ, కర్బుజా వంటి పండ్ల ధరలు కేజీకి 7నుంచి 10 రూపాయలకు పడిపోయాయి. పెట్టుబడులు పెరిగి, అమ్ముడుపోక పండ్లు తోటల్లోనే కుళ్లిపోతుండటంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.
